: మోడీపై కేసు నమోదు చేయండి: ఈసీ
బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కేసు నమోదు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ పోలీసులను ఆదేశించింది. ఈ రోజు తన ఓటు హక్కు వినియోగించుకున్న మోడీ కమలం బొమ్మను చేతిలో పట్టుకుని మీడియాతో మాట్లాడారు. ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి ఎన్నికల గుర్తును పోలింగ్ స్టేషన్ల దగ్గర ప్రదర్శించడం ఓటర్లను ప్రలోభపెట్టడం కిందకు వస్తుంది. దీంతో, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించిన మోడీపై కేసు నమోదు చేయాలని ఈసీ ఆదేశించింది.