: అవమానకరంగా 2జీ స్పెక్ట్రమ్ 'జేపీసీ' విచారణ: యశ్వంత్ సిన్హా


2జీ స్పెక్ట్రమ్ వ్యవహారంలో జేపీసీ (సంయుక్త పార్లమెంటరీ కమిటీ) చేస్తున్న విచారణపై బీజేపీ నేత యశ్వంత్ సిన్హా ఘాటు విమర్శలు చేశారు. 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులపై జేపీసీ విచారణ అవమానకర పద్ధతిలో సాగుతోందని విమర్శించారు. విచారణను నిర్వహిస్తున్న జేపీసీ ఛైర్మన్ పీసీ చాకో పలు విషయాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

కాగా, 2జీకి సంబంధించి ఎన్డీఏ హయాం నాటి కార్యకలాపాలపై విచారణ కోసమే సమయాన్నంతా ఈ కమిటీ వృధా చేస్తోందని ఎద్దేవా చేశారు. రెండు నెలల నుంచి ఎలాంటి సమావేశం జరపలేదని, ఎవరినీ విచారణకు పిలవలేదని వ్యాఖ్యానించారు. అయితే జేపీసీ ముందు హజరై సాక్ష్యం ఇచ్చేందుకు మాజీ మంత్రి రాజాను అనుమతించాలని ప్రధాని మంత్రి మన్మోహన్ సింగ్ కు సిన్హా నిన్న రాసిన లేఖలో విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News