: అవి రూ. 2.5 కోట్లు...వారిని పట్టుకోండి: భన్వర్ లాల్
సూర్యాపేట వద్ద నోట్ల కట్టలతో తగలబడిన ఇన్నోవా కారులో రెండున్నర కోట్ల రూపాయలు ఉన్నాయని, ఆ కారును వదిలి పరారైన వారిని పట్టుకుని అరెస్టు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ భన్వర్ లాల్ పోలీసులను ఆదేశించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఏం జరిగింది?, ఎలా జరిగింది? అంటూ ఘటనపై పోలీసులను ఆరాతీశారు. తక్షణం దానిపై పూర్తి విచారణ చేసి నివేదిక అందజేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.