: 50 అడుగుల లోతులో పడ్డా... తొమ్మిది మందీ నిక్షేపం
పది అడుగుల తోతులో పడ్డా వాహన ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడడం లక్కీగానే చెప్పుకోవచ్చు. అలాంటిది 50 అడుగుల లోతైన లోయలో పడిపోయినా, ప్రాణాలతో తప్పించుకున్నారు ఓ తొమ్మిది మంది. ఉత్తరాఖండ్ లోని డెహ్రాడూన్ కు చెందిన పెట్రోలియం యూనివర్సిటీ బీటెక్ విద్యార్థులు తొమ్మిది మంది కారులో బయల్దేరారు. వారిలో ఒకరిది పుట్టిన రోజు కావడంతో ముస్సోరీకి వెళుతుండగా సోమవారం అర్ధరాత్రి ఒంటి గంటకు వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. అదృష్టవశాత్తూ స్థానికులు వారి అరుపులను విని కాపాడారు. ఆరుగురికి స్వల్ప గాయాలు కాగా, ముగ్గురికి తీవ్రగాయాలు అయ్యాయి.