: ఓటింగ్ రోజు సాధారణ విధులు నిర్వర్తిస్తున్న ఏకైక శాఖ


ఓటింగ్ సందర్భంగా తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. అందరూ విధిగా సెలవు తీసుకోవాలని, ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం అధికారులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ఎన్నికల సిబ్బంది కాకుండా, ఒకే ఒక ప్రభుత్వ శాఖ విధులు నిర్వర్తిస్తోంది. అది కార్మికశాఖ! ప్రభుత్వ ఉత్తర్వులను బేఖాతరు చేసిన ప్రైవేటు రంగ సంస్థలపై కొరడా ఝళిపిస్తోంది.

హైదరాబాదు, రంగారెడ్డి జిల్లాల పరిథిలో విధులు నిర్వర్తిస్తున్న పలు సంస్థలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, సిబ్బందిని బయటకు పంపేశారు. ప్రభుత్వ ఉత్తర్వులను పాటించని యాజమాన్యంపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News