: ఓటు హక్కు వినియోగించుకున్న సీఎస్ మహంతి, డీజీపీ ప్రసాదరావు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, డీజీపీ ప్రసాదరావు, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం అనురాగ్ శర్మ మాట్లాడుతూ, ఇప్పటి వరకు పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగిందని... ఓటర్లు ఉత్సాహంగా ఓటు వేస్తున్నారని తెలిపారు. అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించినా... అధికారులు ఆ సమస్యను వెంటనే పరిష్కరించారని చెప్పారు.