: ఇటలీ రాయబారిపై ఆంక్షలు ఎత్తివేసిన సుప్రీంకోర్టు
ఇటలీ రాయబారి డానియెల్ మాన్సినిపై విధించిన ఆంక్షలను సుప్రీంకోర్టు ఈరోజు ఎత్తి వేసింది. భారత్ వదిలి వెళ్లకూడదంటూ పెట్టిన ఆంక్షలను సడలించింది. కేరళ తీరంలో భారత జాలర్ల హత్య కేసులో ఇద్దరు ఇటలీ నావికాధికారులను భారత్ పంపేందుకు ఆ దేశం నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన సుప్రీం గతనెలలో భారత్ లో ఇటలీ రాయబారి మాన్సినిపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.