: పేరు చూసుకోవడానికే వెళ్లా: చిరంజీవి


ఓటు వేసే విషయంలో తాను ఈసీ నిబంధనలను ఉల్లంఘించలేదని కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. ఓటు వేయడానికి తాను లోపలికి వెళ్లలేదని... ఓటర్ల జాబితాలో తన పేరు ఉందో లేదో అధికారులను అడిగి తెలుసుకోవడానికి వెళ్లానని చెప్పారు. గతంలో తన ఓటు ఓబుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో ఉండేదని... ఇప్పుడు జూబ్లీహిల్స్ క్లబ్ కు మారినందున క్లారిఫై చేసుకునేందుకు లోపలికి వెళ్లానని తెలిపారు. చిరంజీవి నేరుగా బూత్ లోకి ఓటు వేయడానికి వెళ్లడంతో.. అక్కడున్న కొందరు ఓటర్లు అభ్యతరం తెలిపిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News