: మొదటిసారి ఓటు వేయడం గర్వంగా ఉంది: సైనా నెహ్వాల్
ప్రముఖ షట్లర్ సైనా నెహ్వాల్ తన ఓటు హక్కును వినియోగించుకుంది. గచ్చిబౌలిలోని టెలికామ్ నగర్ లో ఓటు వేసింది. దాదాపు గంటపాటు క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మొదటి సారి ఓటు వేయడం చాలా గర్వంగా ఉందని చెప్పింది. ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపింది.