: ఓటు హక్కు వినియోగించుకున్న జేపీ


మల్కాజ్ గిరి లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్న లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ హైదరాబాదు ఎర్రమంజిల్ ప్రాంతంలోని పౌరసరఫరాల కార్యాలయంలోని పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఓటు వేశారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ, ఓటు కంటే బలమైనది మరేదీ లేదని చెప్పారు. యువత తమ భవిష్యత్తు కోసం ఓటు హక్కును కచ్చితంగా వినియోగించుకోవాలని కోరారు. ఎలాంటి భయాందోళనలకు, ప్రలోభాలకు లోను కాకుండా సరైన అభ్యర్థికి ఓటు వేయాలని చెప్పారు.

  • Loading...

More Telugu News