: పవన్ కల్యాణ్ కు లీగల్ నోటీసు పంపిన హరీష్ రావు
సినీ హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కు టీఆర్ఎస్ నేత హరీష్ రావు లీగల్ నోటీసు పంపారు. రెండు రోజుల్లోగా పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని హరీష్ రావు ఈ నోటీసులో పేర్కొన్నారు.
రెండు రోజుల కిందట పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు. ఆ సమయంలో కాంగ్రెస్ నేత బొత్స సత్యనారాయణతో ఉన్న వ్యాపార సంబంధాల గురించి హరీష్ రావు వెల్లడించాలని ఆయన బహిరంగ సభలో డిమాండ్ చేశారు. దీనిపై మండిపడ్డ హరీష్ రావు ఇప్పడు పవన్ కల్యాణ్ కు లీగల్ నోటీసు పంపించారు.