: విశాలాంధ్రలో ఇవే చివరి ఎన్నికలు
సువిశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు, మే 7న జరుగనున్న ఎన్నికలు చివరివి. జూన్ 2న రాష్ట్ర విభజన పూర్తి కానున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రతిష్టాత్మకం కానున్నాయి. 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. నాటి నుంచి నేటి వరకు 22 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రాన్ని పరిపాలించారు. ఎన్టీఆర్ మూడు సార్లు, నీలం సంజీవరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి, చంద్రబాబునాయుడు, రాజశేఖర్ రెడ్డి రెండేసిసార్లు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని పరిపాలించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి కాగా, చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలు రాష్ట్రపతి పాలనలోనే జరుగుతుండడం విశేషం. ఈ ఎన్నికల తరువాత సువిశాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలుగా ఏర్పాటు కానుంది.