: టీఆర్ఎస్ కార్యకర్త నుంచి రూ. 20 లక్షలు స్వాధీనం
వరంగల్ జిల్లా భూపాల్ పల్లి నియోజకవర్గంలో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో భారీగా డబ్బు పట్టుబడింది. ఓ టీఆర్ఎస్ కార్యకర్త నుంచి రూ. 20 లక్షలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. తెలంగాణలో రేపు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో, భారీ ఎత్తున మద్యం, డబ్బు పంపిణీ జరుగుతోంది.