: పిల్లల మాటలు మానండి...స్థాయికి తగ్గట్టు మాట్లాడండి: ప్రియాంకా గాంధీ
నరేంద్ర మోడీపై ప్రియాంకా గాంధీ విరుచుకుపడ్డారు. అమేథీలో ఓ ప్రచారసభలో ఆమె మాట్లాడుతూ, తన తండ్రి కంప్యూటర్లు ప్రవేశపెట్టినప్పుడు కూడా చాలా విమర్శలు ఎదుర్కొన్నారని అన్నారు. ఆనాటి ఆయన స్వప్నమే ఇప్పడు సాకారమై దేశాన్ని అగ్రదేశాల సరసన చేర్చిందని ఆమె తెలిపారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా సుదీర్ఘ, భవిష్యత్ ప్రణాళికలు రచిస్తుంటే విమర్శలు వినిపిస్తున్నాయని ఆమె చెప్పారు. మోడీ ప్రధాని పదవికి పోటీ పడుతున్న వ్యక్తి అని, పిల్లల మాటలు మాని ఆ పదవికి తగ్గ స్థాయిలో మాట్లాడితే బాగుంటుందని ఆమె సూచించారు.