: మెడికల్ పీజీ ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ విడుదల


వచ్చే విద్యా సంవత్సరంలో మెడికల్ (ఎండీ, ఎంఎస్), దంత వైద్య విద్య(ఎండీఎస్)లో పీజీ ప్రవేశాల పరీక్ష కోసం నోటిఫికేషన్ విడుదల అయింది. దంత వైద్య విద్య ప్రవేశ పరీక్ష మార్చి 9న జరుగుతుంది. ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశాల కోసం పరీక్ష మార్చి 17న వుంటుంది.

దీనికి సంబంధించిన దరఖాస్తులు ఈ నెల 9 నుంచి 15 వరకు వెబ్ సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం తెలిపింది. పూర్తి చేసిన దరఖాస్తుల సమర్పణకు ఫిబ్రవరి 18 గడువుగా ప్రకటించింది. పూర్తి వివరాలను విశ్వవిద్యాలయం వెబ్ సైట్ నుంచి తెలుసుకోవచ్చని తెలిపింది.

  • Loading...

More Telugu News