: సీమాంధ్రలో సమర్థవంతమైన ప్రభుత్వం రావాలి: వెంకయ్య నాయుడు


సీమాంధ్రను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని... దానికోసం ఇక్కడ సమర్థవంతమైన ప్రభుత్వం రావాల్సి ఉందని బీజేపీ జాతీయ నేత వెంకయ్య నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన తిరుపతిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మోడీ ప్రధాని అయినా... ఇక్కడి ప్రభుత్వం సరైనది కాకపోతే ఆశించిన అభివృద్ధి సాధ్యం కాదని చెప్పారు. దేశ వ్యాప్తంగా మోడీకున్న హవా, సంస్థాగతంగా టీడీపీకి ఉన్న బలమైన వ్యవస్థ ఎన్నికల్లో మంచి ఫలితాలను రాబడుతుందని తెలిపారు. మోడీని ప్రధానిని చేసేందుకు రాష్ట్రం నుంచి ఎక్కువ సంఖ్యలో ఎంపీలను గెలిపించాలని కోరారు.

  • Loading...

More Telugu News