: మోడీకి భద్రత పెంచండి... రాష్ట్రపతికి వీహెచ్ పీ లేఖ
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీపై ఆత్మాహుతి దాడి జరిగే అవకాశం ఉందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) తీవ్రంగా అనుమానిస్తోంది. ఈ మేరకు వీహెచ్ పీ అధినేత అశోక్ సింఘాల్... మోడీకి మెరుగైన భద్రత కల్పించాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి లేఖ రాశారు.
'మీ ప్రభుత్వం ద్వారా, ఇతర రాష్ట్రాల ప్రభుత్వాల సహాయంతో మోడీని రక్షించేందుకు కట్టుదిట్టమైన భధ్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నాము. మోడీపై ఆత్మాహుతి దాడి జరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే ఇంటలిజెన్స్ బ్యూరో హై అలర్ట్ జారీ చేసింది. ఒక మద్దతుదారుడిలా మారువేషంలో వచ్చి ఈ దాడికి పాల్పడవచ్చని కూడా ఐబీ తెలిపింది' అని సింఘాల్ లేఖలో వివరించారు.