: రాందేవ్ బాబా అరెస్టయ్యే అవకాశాలు
యోగా గురువు రాందేవ్ బాబా అరెస్టయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. దళితుల ఇళ్లకు హనీమూన్ కోసమే రాహుల్ వెళతారని ఆయన చేసిన వ్యాఖ్యలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద రాందేవ్ పై ఉత్తరప్రదేశ్ లో మూడు ఎఫ్ఐఆర్ లు దాఖలయ్యాయి. గోరఖ్ పూర్, పాట్నా, ఆగ్రాలో ఒక్కో కేసు చొప్పున నమోదైంది. వీటిపై నేడు విచారణ జరగనుంది. రాందేవ్ ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసుకుని, అది లభిస్తే తప్ప ఈ కేసుల్లో ఆయన అరెస్ట్ కు అవకాశాలుంటాయి.