: నేడు గుంటూరు జిల్లాలో పవన్ కల్యాణ్ పర్యటన
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ రోజు గుంటూరు జిల్లాలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం 11 గంటలకు నరసరావుపేటలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు చిలకలూరిపేటలో నిర్వహించే బహిరంగసభలో ప్రసంగించనున్నారు. ఇక 30వ తేదీన బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ పాల్గొనే టీడీపీ-బీజేపీ సభల్లోనూ ఆయన పాల్గొంటారు.