: బీజేపీ, కాంగ్రెస్ మధ్య ముదిరిన సీడీల యుద్ధం


జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల మధ్య కొత్త తరహా విమర్శల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాపై సీడీని బీజేపీ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ సీడీలో భూకుంభకోణాల్లో వాద్రా పాత్ర ఉందని బీజేపీ ఆరోపించింది. దీనికి ప్రతిచర్యగా ఈ రోజు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీపై కాంగ్రెస్ పార్టీ సీడీని విడుదల చేసింది. హవాలా కుంభకోణంలో అరెస్ట్ అయిన అఫ్రాజ్ అనే వ్యక్తితో మోడీ కలసి ఉన్న ఫొటోలను ఈ సీడీలో ఉంచింది.

  • Loading...

More Telugu News