: తెలంగాణలో ముగిసిన ప్రచారం... ఎల్లుండే పోలింగ్
తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి తెర పడింది. మావోయిస్టు ప్రాబల్యం ఎక్కువగా ఉన్న భద్రాచలం, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకే ప్రచారం ముగియగా... సిర్పూర్, అచ్చంపేట, అసిఫాబాద్, ఖానాపూర్, చెన్నూర్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో 5 గంటల వరకు కొనసాగింది. మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో 6 గంటల వరకు ప్రచార పర్వం కొనసాగింది. ఈ నెల 30న (ఎల్లుండి) తెలంగాణలో పోలింగ్ జరగనుంది.