: మండు వేసవిలో హైదరాబాదు రోడ్లపై వడగళ్లు!
మండువేసవిలో హైదరాబాదులో భారీ వర్షం కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో నగర ప్రజలకు వేసవి తాపం నుంచి ఉపశమనం లభించినట్లయింది. హైదరాబాదులోని కొత్తపేటలో వడగళ్లతో కూడిన వర్షం కురిసింది. దిల్ సుఖ్ నగర్, ఉప్పల్, రామంతాపూర్ లలో భారీ వర్షం కురిసినట్లు వార్తలందాయి.