: పోలింగ్ రోజున సెలవు ఇవ్వకపోతే యజమాని జైలుకే: భన్వర్ లాల్


ఏప్రిల్ 30వ తేదీ, బుధవారం రోజున పోలింగ్ సందర్భంగా తెలంగాణ ప్రాంతంలో పూర్తిగా సెలవు ప్రకటించామని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ తెలిపారు. ప్రైవేటు షాపులకు ఆ రోజున సెలవు ఇవ్వకుంటే కేసులు పెడతామని ఆయన హెచ్చరించారు. ఓటర్లకు సెలవు ఇవ్వకపోతే యజమానికి ఏడాది జైలు శిక్ష విధిస్తామని ఆయన తెలిపారు.

ఏప్రిల్ 30వ తేదీన జరిగే ఎన్నికల దృష్ట్యా ఎలక్ట్రానిక్ మీడియాపై ఆంక్షలు విధించినట్లు భన్వర్ లాల్ చెప్పారు. ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి ఎల్లుండి (30వ తేదీ) సాయంత్రం 6 గంటల వరకూ ఆంక్షలు విధించినట్టు ఆయన తెలిపారు. ఎగ్జిట్ పోల్స్, ఒపీినియన్ పోల్స్ పై పూర్తిగా నిషేధముంటుందన్నారు. ఈ 48 గంటల పాటు ఒపీనియన్ పోల్స్ ప్రసారం చేయకూడదని ఆయన హెచ్చరించారు.

  • Loading...

More Telugu News