: ధనికుల అభివృద్ధే మోడీ అభివృద్ధి: దిగ్విజయ్


గుజరాత్ ను అద్భుత రీతిలో అభివృద్ధి చేశానని బీజేపీ ప్రధాని అభ్యర్థి మోడీ చెప్పుకుంటున్నారని... నిజానికి ఆయన చేసింది ధనికుల అభివృద్ధి మాత్రమే అని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అబద్ధాలు చెప్పేవారికి నోబెల్ ప్రైజ్ ఇస్తే... అది కచ్చితంగా మోడీకే వస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై కూడా దిగ్విజయ్ విమర్శలు గుప్పించారు. మొన్నటి దాకా కాంగ్రెస్ వెనకాలే తిరిగిన కేసీఆర్... తీరా తెలంగాణ వచ్చాక కాంగ్రెస్ నే విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

  • Loading...

More Telugu News