: ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో సమూల మార్పులు: జైరాం రమేశ్
ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలో సమూల మార్పులు చేస్తామని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ తెలిపారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి యువకులను ఆహ్వానిస్తామని, కొత్త రక్తం ఎక్కిస్తామని ఆయన అన్నారు. 2014 ఎన్నికల తర్వాత పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామన్నారు. ఈసారి ఎన్నికల్లో 30-40 సంవత్సరాల మధ్య వయస్కులకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు కేటాయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.