: ఇవాళ సాయంత్రం నుంచి 30వ తేదీ వరకు మద్యం దుకాణాలు బంద్: భన్వర్ లాల్
తెలంగాణలో ఇవాళ్టితో ఎన్నికల ప్రచారానికి తెరపడనున్న నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్ లాల్ హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. సాయంత్రం 4 గంటలతో ఎన్నికల ప్రచారం నిలిచిపోనున్నదని, ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల నేపథ్యంలో ఇవాళ సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు మూతపడనున్నట్లు భన్వర్ లాల్ తెలిపారు. ఇవాళ్టి నుంచి 30వ తేదీ వరకు వైన్ షాపులు, బార్లు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు.