: ఖమ్మంలో కొనసాగుతోన్న ప్రలోభాల పర్వం... భారీగా మద్యం పట్టివేత
ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఓటర్లకు పంచిపెట్టేందుకు దాచి పెట్టిన మద్యం తాలూకు ఘటనలూ ఒక్కొక్కటీ వెలుగు చూసున్నాయి. తాజాగా ఖమ్మం పట్టణంలోని ఓ గోడౌన్ లో భారీగా క్రికెట్ కిట్లు, మద్యాన్ని పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అయితే, ఈ మద్యాన్ని ఎవరు దాచిపెట్టారన్న విషయం ఇంకా తేలాల్సి ఉంది. ఖమ్మంలో పోలీసుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రచారం, హామీలతో ఓట్లు పడవని భావించిన అభ్యర్థులు... బడుగు, బలహీన వర్గాల వారికి డబ్బు, మద్యం పంచిపెడుతూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.