: కేసీఆర్ ఎన్నికలప్పుడు దానకర్ణుడు, ఎన్నికలయ్యాక కుంభకర్ణుడు: కిషన్ రెడ్డి
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల్లో కేసీఆర్ గుప్పిస్తున్న హామీలపై స్పందిస్తూ... ఎన్నికలప్పుడు కేసీఆర్ దానకర్ణుడని, ఎన్నికలయ్యాక కుంభకర్ణుడని విమర్శించారు. కేసీఆర్ వ్యవహారశైలిపై తెలంగాణ జేఏసీ స్పందించాలని కోరారు. తెలంగాణ కేసీఆర్ జాగీరు కాదని ఎద్దేవా చేశారు.