: నెత్తురు బొట్టు చిందకుండా రక్తపరీక్ష!


బ్లడ్‌ టెస్ట్‌ అనగానే.. మన శరీరంలోంచి ఎంత నెత్తురు తీసేస్తారో ఏమో అని భయపడే అమాయకులు, చిన్న సిరంజితో రక్త నమూనా తీసుకున్నా సరే.. బెంబేలెత్తిపోయే వారు ఎందరో మనలో ఉంటారు. ఇలాంటి వారికోసమే అన్నట్లుగా.. అసలు చుక్క రక్తం చిందకుండా రక్త పరీక్షలు పూర్తిచేసే ఒక నవీన పరికరాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. పైగా ఈ పరికరం.. రోగి సెల్‌ఫోన్‌తో అనుసంధానమై.. అతడి రక్త పరీక్షల వివరాలను డాక్టరు కంప్యూటరుకు ఎప్పటికప్పుడు పంపించేస్తూ ఉంటుంది కూడా!
రక్తంలోని గ్లూకోజ్‌, ఇతర ఎంజైంలను గుర్తించే ఈ పరికరాన్ని యూరప్‌లో రూపొందించారు. ఐదు సెన్సర్లు, ఒక ట్రాన్స్‌మిటర్‌ ఉండే 14 ఎంఎం పొడవుండే ఈ పరికరాన్ని శరీరంలోపలకు ప్రవేశపెట్టేస్తారు. చర్మం వెలుపల అంటించే బ్యాటరీ ద్వారా ఇది పనిచేస్తుంది. అవసరమైనప్పుడు బ్యాటరీ పెడితే. అది రక్తాన్ని పరీక్షించి..  ఆవివరాల్ని బ్లూటూత్‌ ద్వారా రోగి మొబైల్‌కు పంపుతుంది. మరో అప్లికేషన్‌తో అది డాక్టరు  కంప్యూటరుకు వెళ్తుంది. క్షణాల్లో పూర్తయ్యే ఈ ప్రక్రియ షుగర్‌, కేన్సర్‌ రోగులకు ఉపయోగకరం. 

  • Loading...

More Telugu News