: ఆ పోప్ లిద్దరూ మహిమాన్వితులు!


కేథలిక్ చర్చికి నేతృత్వం వహించిన దివంగత పోప్ లు ఇద్దరికి 'సెయింట్' హుడ్ (మహిమాన్వితుల హోదా) లభించింది. వాటికన్ సిటీలోని సెయింట్ పీటర్స్ స్క్వేర్ వద్ద పోప్ ఫ్రాన్సిస్ ప్రకటన చేశారు. లక్షలాది మంది భక్తుల సమక్షంలో 'చర్చి ఏకాభిప్రాయం మేరకు, దేవుని ఆశీర్వాదం పొందిన పోప్ జాన్ 23, పోప్ జాన్ పాల్ 2లను మహిమాన్వితులుగా ప్రకటిస్తున్నామని, నేటి నుంచి వారు ఆ జాబితాలో చిరస్మరణీయులుగా గుర్తింపు పొందుతారని' ఆయన ప్రకటించగానే సెయింట్ పీటర్స్ స్క్వేర్ నుంచి టైబర్ నదీ తీరం వరకు వ్యాపించిన జనసంద్రం హర్షాతిరేకంతో హోరెత్తింది.

కేధలిక్కులలో మహిమాన్విత హోదా లభించేందుకు కొన్ని అర్హతలు ఉండాలి. వారి పేరిట అద్భుతాలు జరగాలి. అవి నిర్ధారణ అవ్వాలి. అవి సైన్సుకు అందకూడదు. అప్పుడు కమిటీ వాటిని శల్యపరీక్ష చేసి వాస్తవమేనని నిర్ధారణ చేసిన తరువాత చర్చికి నివేదిస్తుంది. తరువాత మరో కమిటీ వాటిని నిర్థారించి సిఫారసు చేస్తుంది.

ఆ తరువాత కూడా కొన్ని సాక్ష్యాలు లభ్యమైతే అప్పుడు మహిమాన్విత పట్టం కడతారు. ఇద్దరు పోప్ లకు మహిమాన్విత పట్టం కట్టగా, ఈ ఘట్టానికి ఇద్దరు పోప్ లు హాజరుకావడం విశేషం. స్వచ్ఛంద విరమణ పొందిన పోప్ బెనడిక్ట్ 16, పోప్ ఫ్రాన్సిస్ లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News