: టీఆర్ఎస్, టీడీపీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవు: జైరాం రమేష్
టీఆర్ఎస్, టీడీపీలు సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేవని కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, టీఆర్ఎస్ కు ఓటేస్తే దొరలకు ఓటేసినట్టేనని అన్నారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని, అందుకే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో మొదటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీయే ఏర్పాటు చేస్తుందని ఆయన స్పష్టం చేశారు.