: అఖిలేష్ దంపతులకు తప్పిన ముప్పు


ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, అతని భార్య, ఎంపీ డింపుల్ హెలికాప్టర్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. అఖిలేష్ యాదవ్ సమీప బంధువు అంత్యక్రియలకు హాజరై హెలికాప్టర్ లో తిరిగి వస్తుండగా, లక్నోకు 12 కిలోమీటర్ల దూరంలో, భూమికి 3 వేల అడుగుల ఎత్తులో ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను ఓ గద్ద ఢీకొంది. దీంతో అత్యవసరంగా హెలికాప్టర్ ను పైలట్లు దించేశారు.

ముందుగానే కంట్రోల్ రూమ్ కు విషయం తెలియజేయడంతో ప్రమాద నివారణకు అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది హెలికాప్టర్ దిగిన ప్రదేశానికి చేరుకున్నాయి. అయితే ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

  • Loading...

More Telugu News