: బీజేపీలో చేరనున్న కావూరి?


కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడైన కావూరి సాంబశివరావు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కొన్ని రోజుల క్రితం ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారని ఊహాగానాలు వెలువడిన సంగతి తెలిసిందే. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీ లో చేరడానికి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీంతో మే 1న బీజేపీ-టీడీపీ కూటమి ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లాలో నిర్వహించనున్న సభలో పాల్గొని మోడీ, చంద్రబాబు, పవన్ ల సమక్షంలో బీజీపీలో చేరనున్నట్టు సమాచారం. ఈ సందర్భంగా భారీ ర్యాలీతో వెళ్లి బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు ఆయన అనుచరులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News