: మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు
ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాలు విడుదల కానున్నాయి. వీటిని గవర్నర్ సలహాదారు విడుదల చేస్తారని ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి నిన్న ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాల గ్రేడులతో పాటు మార్కులను కూడా అందుబాటులో ఉంచనున్నారు. ఫలితాలను బీఎస్ఎన్ఎల్ ల్యాండ్ లైన్ నుంచి 1100కు, ఇతర ల్యాండ్ లైన్లు, మొబైల్ ఫోన్ల నుంచి 18004251110కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. రెండవ సంవత్సరం ఫలితాలను మే 2 లేదా 3వ తేదీన ప్రకటించనున్నట్టు సమాచారం.