: టీడీపీ గెలుపే పేదల గెలుపు: ఎల్.రమణ
కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగిన అంతులేని అవినితి, కుంభకోణాల వల్లే దేశ ఆర్థిక స్థితి దిగజారిందని టీడీపీ నేత ఎల్.రమణ ఆరోపించారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరిగిన టీడీపీ బహిరంగసభలో మాట్లాడిన ఆయన... టీడీపీ, బీజేపీ అభ్యర్థులనే గెలిపించాలని పిలుపునిచ్చారు. టీడీపీ గెలుపు పేద ప్రజల గెలుపని చెప్పారు.