: సోనియా హెలికాప్టర్ లో సాంకేతిక లోపం
చేవెళ్లలో ఎన్నికల ప్రచారం ముగించుకుని మెదక్ జిల్లా ఆంథోల్ కు బయల్దేరేందుకు సిద్ధమైన కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి ఊహించని పరిణామం ఎదురైంది. ఆమె ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆమెకు ఆర్మీ హెలికాప్టర్ సమకూర్చేందుకు ప్రయత్నించారు. అయితే, ఆర్మీ హెలికాప్టర్ ను ఆమె తిరస్కరించారు. రోడ్డు మార్గంలో ఆంథోల్ బయల్దేరారు.