: జగిత్యాలను జిల్లా చేస్తాం: చంద్రబాబు


తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు జగిత్యాలను జిల్లా చేస్తామని అన్నారు. కరీంనగర్ జిల్లా జగిత్యాలలో జరుగుతున్న ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ ఈ హామీ ఇచ్చారు. బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా మహారాష్ట్ర వెళ్లి లాఠీ దెబ్బలు తిన్నామని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ వల్లే తెలంగాణకు మిగులు బడ్జెట్ వచ్చిందని తెలిపారు. హైదరాబాదును ఐటీ నగరంగా చేసింది తానేనన్నారు. పేదవాళ్ల ప్రతినిధిగా ఎల్.రమణ వీరోచితంగా పోరాడారని ప్రశంసించిన చంద్రబాబు, తన పాదయాత్రలో ఆడబిడ్డల కష్టాలు చూశానని, టీడీపీ అధికారంలోకి వచ్చాక వారి కష్టాలు తీరుస్తామన్నారు. డ్వాక్రా సంఘాల రుణాలు మాఫీ చేస్తామన్నారు.

  • Loading...

More Telugu News