: అమలాపురాన్ని మరో కేరళ చేస్తా: విశ్వరూప్
అమలాపురాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని వైఎస్సార్సీపీ లోక్ సభ అభ్యర్థి పి.విశ్వరూప్ అన్నారు. అమలాపురం లోక్ సభ నియోజకవర్గంలో ప్రచారం చేస్తూ... కోనసీమలో అంతర్భాగమైన అమలాపురాన్ని మరో కేరళ చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం చేపట్టే అన్ని సంక్షేమ పథకాలను ప్రజలకు చేర్చడంలో కృషి చేస్తానని చెప్పారు.