: చిరు, పవన్ లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారు: ఆదిశేషగిరిరావు
రాష్ట్ర విభజనకు కారణమైన కాంగ్రెస్, బీజేపీలతో చిరంజీవి, పవన్ కల్యాణ్ లు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నారని వైఎస్సార్సీపీ నేత, సినీ నిర్మాత ఆదిశేషగిరిరావు ఆరోపించారు. కాకినాడలో ఆయన మాట్లాడుతూ, అవసరమైతే తన సోదరుడు, సినీ నటుడు కృష్ణ వైకాపా తరపున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని తెలిపారు. సీమాంధ్ర అభివృద్ధి కేవలం జగన్ తోనే సాధ్యమని చెప్పారు.