: నేను ప్రకటించాకే కాంగ్రెస్ దాన్ని ప్రకటించింది: చంద్రబాబు
టీడీపీ అధినేత చంద్రబాబు ఈ రోజు నిజామాబాద్ జిల్లా బోధన్ లో ఎన్నికల సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ నేతలకు దోచుకోవడం తప్ప మరేమీ పట్టదని ఆరోపించారు. రైతులకు రుణ మాఫీ చేస్తామని తాము ప్రకటించాకే... కాంగ్రెస్ కూడా అదే విషయాన్ని ప్రకటించిందని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి తొమ్మిది గంటలపాటు నాణ్యమైన విద్యుత్ ను అందిస్తామని చెప్పారు.