: రామ్ దేవ్ పై ఈసీ నిషేధం


యోగా గురువు బాబారాందేవ్ పై ఎన్నికల సంఘం కొరడా ఝుళిపించింది. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ లోని లక్నో జిల్లాలో మే 16 వరకు బాబా ఎలాంటి సభల్లో పాల్గొనకుండా, విలేకరుల సమావేశాలు నిర్వహించకుండా ఎన్నికల సంఘం (ఈసీ) నిషేధం విధించింది. అయితే, ఈ నిషేధాన్ని లక్నో జిల్లా వరకే పరిమితం చేసింది. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విహారయాత్రల కోసం, హనీమూన్ కోసం దళితుల ఇళ్లకు వెళతారంటూ రాందేవ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేతలపై వ్యక్తిగత దూషణను అనుమతించేది లేదని ఈసీ తాజాగా స్పష్టం చేసింది.

  • Loading...

More Telugu News