: పల్నాడును జిల్లాగా చేస్తాం: రాయపాటి
గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన రాయపాటి సాంబశివరావు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ఈ క్రమంలో ఓటర్లకు ఆయన హామీల వర్షం కురిపిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పల్నాడు ప్రాంతాన్ని ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. నరసరావుపేటలో రైల్వే కేంద్ర కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ఉద్యోగావకాశాలు కల్పిస్తామని చెప్పారు. కేంద్రం నుంచి సీమాంధ్రకు నిధులను రాబట్టేందుకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని ఆయన తెలిపారు.