: పొన్నూరు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థి రమణపై కేసు
గుంటూరు జిల్లా పొన్నూరు వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. యడ్లపాడు మండలం, ఉన్నవ గ్రామం వద్ద నిన్న మద్యం నిల్వలు బయటపడడంతో రమణతోపాటు మరో ముగ్గురిపై ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 14 ప్రకారం పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేశారు.