: నేడు చంద్రబాబు ప్రచార షెడ్యూల్
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఈ రోజు తెలంగాణలోని నాలుగు జిల్లాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. ఉదయం 10.45 గంటలకు నిజామాబాద్ జిల్లా బోధన్ లో బాబు ప్రచారం ప్రారంభమవుతుంది. 11.45కు కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చేరుకుంటారు. 2.30 గంటలకు కందుకూరు, 4 గంటలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, 6 గంటలకు మెదక్ జిల్లా పటాన్ చెరు, రాత్రి 8 గంటలకు శేరిలింగంపల్లిలో జరిగే సభల్లో చంద్రబాబు ప్రసంగించనున్నారు.