: దళితుల మనస్సులు గాయపడి ఉంటే క్షమించండి: రాందేవ్ బాబా
ప్రముఖ యోగా గురువు రాందేవ్ బాబా దళితులకు క్షమాపణలు చెప్పారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ దళితుల నివాసాలకు హనీమూన్ కోసం వెళ్తున్నారని రాందేవ్ బాబా ఆరోపించిన సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యలపై అన్ని వర్గాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో, దళితుల మనస్సులు గాయపడి ఉంటే క్షమాపణలు చెబుతున్నట్టు ఆయన ప్రకటించారు.