: బాలకృష్ణకు ఎన్నికల్లో పోటీ చేసే ఆర్హత ఉందా?: షర్మిళ
సినీ నటుడు బాలకృష్ణకు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత ఉందా? అని వైఎస్సార్సీపీ నేత షర్మిళ ప్రశ్నించారు. అనంతపురం జిల్లా హిందూపురంలో ప్రచారం సందర్భంగా ఆమె మాట్లాడుతూ, గతంలో బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగిన సందర్భంగా, ఆయనకు మనఃస్థితి సరిగా లేదని సర్టిఫికేట్ తెచ్చుకున్నారని షర్మిళ గుర్తు చేశారు. బాలకృష్ణ మంచి సినీ నటుడు కావోచ్చేమోకానీ మంచి రాజకీయ వేత్త కాలేరని అన్నారు. గతంలో ఎన్టీఆర్ పై చెప్పులు వేయించి, వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుతో బాలకృష్ణ చెట్టాపట్టాలేసుకుని తిరగడం మంచి కొడుకు లక్షణం కాదని అన్నారు. పిచ్చివాళ్లకు ఓటేస్తే ప్రజలను వారు పిచ్చోళ్లను చేస్తారని ఆమె హెచ్చరించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటేసి గెలిపించాలని ఆమె కోరారు.