: తెలంగాణలో వచ్చే తొలి ప్రభుత్వం మీ భవిష్యత్తును నిర్దేశిస్తుంది: మన్మోహన్


'తెలంగాణలో వచ్చే తొలి ప్రభుత్వమే మీ భవిష్యత్తును నిర్దేశిస్తుందని' నల్గొండ జిల్లా భువనగిరి సభలో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆ ప్రాంతాన్ని ఉద్దేశించి అన్నారు. తమవల్లే తెలంగాణ వచ్చిందని కొందరు చెప్పుకుంటున్నారని... కానీ, ఇచ్చేందుకు కాంగ్రెస్ చేసిన కృషి మీ అందరికీ తెలిసిందేనని చెప్పారు. తెలంగాణ కల సాకారమైనందుకు మీ అందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నానన్నారు. తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్దానం నిలబెట్టుకున్నామని, తెలంగాణ సాధన ప్రక్రియలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయనీ, ఉద్యమంలో అమరులైన వారి త్యాగం వృథా కాలేదని మన్మోహన్ పేర్కొన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ రూపాంతరం చెందాలన్న ప్రధాని, ఈ ప్రాంత అభ్యున్నతి కాంగ్రెస్ తోనే సాధ్యమని, హైదరాబాదును ఆధునిక నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News