: బెంగళూరు వెన్ను విరిచిన రాయల్స్


ఐపీఎల్ 7 లో భాగంగా యూఏఈలోని అబుదాబిలో రాజస్థాన్ రాయల్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్ల మధ్య జరుగుతున్న పోరాటంలో టాస్ గెలిచిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఫిల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్టుకు తొలి ఓవర్ నుంచే కష్టాలు ఆరంభమయ్యాయి. 9 ఓవర్లలోనే పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది.

బ్యాటింగ్ ఆరంభించిన బెంగళూరు ఓపెనర్ టకవాలే (0) ను బిన్నీ బలిగొన్నాడు. వెంటనే పార్థివ్ పటేల్ (1) ను రహానే రనౌట్ చేశాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ (3), డివిలీర్స్ (0) ను కేన్ రిచర్డ్ సన్ పెవిలియన్ బాట పట్టించాడు. అనంతరం సచిన్ రాణా (3)ను వాట్సన్ అవుట్ చేశాడు. తరువాత క్రీజులోకి వచ్చిన మోర్కెల్ (7) ను తంబే అవుట్ చేశాడు దీంతో బెంగళూరు 9 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి కేవలం 24 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇందులో కెప్టెన్ కోహ్లీ(11) మాత్రం రెండంకెల స్కోరును చేరుకుని క్రీజులో ఉన్నాడు.

  • Loading...

More Telugu News