: అందుకే, అప్పుడు ఏపీలో పోటీ చేయలేదు: జయప్రద
అలనాటి అందాలనటి జయప్రద రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్డీ) తరపున ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్ స్థానం నుంచి లోక్ సభ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఇవాళ వరంగల్ వచ్చిన జయప్రద మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ అధినేత చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. తాను గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి పోటీ చేయకపోవడానికి కారణం చంద్రబాబేనని తేల్చి చెప్పారు. మున్ముందు తెలంగాణ, సీమాంధ్రలో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేస్తానని చెప్పారు.