: కేసీఆర్ ఓ మాయల ఫకీర్... జైపాల్ ఓ వలస పక్షి: చంద్రబాబు
టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డిలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఘాటైన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ ఓ మాయల ఫకీర్ అని రకరకాల మాటలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మహబూబ్ నగర్ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్న జైపాల్ రెడ్డి ఓ వలస పక్షి అని... ఒక్కో ఎన్నికలో ఒక్కో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారని విమర్శించారు. ఈ రోజు మహబూబ్ నగర్ జిల్లా అయిజలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, టీఆర్ఎస్ లను చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.